బిన్ లాడెన్ మా హీరో!

Fri,November 15, 2019 03:47 AM

-పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వ్యాఖ్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులైన ఒసామాబిన్ లాడెన్, అల్ జవహరి, జలాలొద్దీన్ హక్కానీ తమ దేశ హీరోలని చెప్పారు. అంతేగాక జమ్ముకశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు పాకిస్థాన్‌లో సాయుధ శిక్షణ ఇచ్చామని, కశ్మీర్‌లోని భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారికి చెప్పామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్‌ను పాక్‌కు చెందిన రాజకీయ నేత ఫర్హతుల్లా బాబర్ బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ముషారఫ్ ఏమన్నారంటే.. పాకిస్థాన్‌కు వచ్చిన కశ్మీరీ వాసులకు ఘనస్వాగతం పలికాం. వాళ్లకు సాయుధ శిక్షణ ఇచ్చాం. మద్దతుగా నిలిచాం.


భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించాం. అంతేకాదు.. ఒసామాబిన్ లాడె న్, జలాలొద్దీన్ హక్కానీ, అల్ జవహరి తదితర జిహాదీలందరూ పాకిస్థాన్ హీరోలు. అయితే ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక వాతావరణం నెలకొన్నదో అప్పటి నుంచి పలు దేశాలు మా హీరోలను విలన్లుగా చూస్తున్నాయి అని ముఫారఫ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముజాహిదీన్‌లను పాక్‌కు తీసుకొచ్చామని, తాలిబన్లకు కూడా శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles