నింగిలోకి జంబో విమానం

Mon,April 15, 2019 01:45 AM

Plane with world longest wingspan takes off and successfully lands

-విజయవంతంగా టెస్ట్న్ పూర్తిచేసుకున్న స్ట్రాటోలాంచ్
-ఉపగ్రహ ప్రయోగాల్లో సరికొత్త విప్లవానికి తొలిఅడుగు

కాలిఫోర్నియా: ఉపగ్రహ ప్రయోగాల్లో సరికొత్త విప్లవానికి తెరతీస్తుందని భావిస్తున్న మహా లోహవిహంగం స్ట్రాటో లాంచ్ తొలిసారి నింగిలోకి ఎగిరింది. దాదాపు 17 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి తొలి పరీక్షను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ జంబో ైఫ్లెట్‌ను అమెరికాకు చెందిన స్కేల్డ్ కాంసైట్స్ అనే సంస్థ తయారుచేస్తున్నది. శనివారం అమెరికా కాలిఫోర్నియాలోని మోజ వే ఎడారిలో నిర్వహించిన టెస్ట్‌ైఫ్లెట్‌లో దాదాపు రెండున్నర గంటలపాటు ఆకాశంలో విహరించిందని సంస్థ సీఈవో జీన్ ఫ్లాయిడ్ తెలిపారు. గరిష్ఠంగా 304 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందని.. 17వేల అడుగుల (5,182 మీటర్లు) ఎత్తుకు చేరిందన్నారు. ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నదని.. అదొక అనిర్వచనీయ అనుభూతి అని వివరించారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్లో జరుగబోయే విప్లవాత్మక మార్పులకు ఈ ప్రయోగంతో బీజం పడింది అని వివరించారు. స్కేల్డ్ కాంసైట్స్ సంస్థ స్థాపనకు, ప్రయోగాలకు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ ఎలెన్ ఆర్థిక సహకారం అందించారు. ఆయన గత ఏడాది అక్టోబర్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. అయినా ఆత్మైస్థెర్యంతో మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.


ప్రయోజనాలు:

-భూమి నుంచి ఉపగ్రహాలను రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపాలంటే నిట్టనిలువుగా పైకి ఎగరాలి. భూమ్యాకర్షణ శక్తిని తట్టు కొని వెళ్లేందుకు అత్యధిక మోతాదులో ఇంధనాన్ని మండించాల్సి వస్తున్నది. స్ట్రాటోలాంచ్ విమానం మాదిరిగా ఎగురుతుంది కాబట్టి తక్కువ ఇంధనంతో వెళ్లవచ్చు.
-స్ట్రాటోలాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అనేకసార్లు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి తయారీ వ్యయం మిగులుతుంది.
- అంతరిక్ష వ్యర్థాలు తగ్గుతాయి.

818
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles