బినామీ ఆస్తులనువెల్లడించాల్సిందే

Tue,June 11, 2019 01:25 AM

Prime Minister Imran Khan to take nation into confidence on financial situation in address

-పాక్ ప్రజలకు ఇమ్రాన్ హెచ్చరిక
ఇస్లామాబాద్, జూన్ 10: బినామీ ఆస్తు లు ఏమైనా ఉంటే వాటిని బహిర్గతం చేయాలని, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రా న్‌ఖాన్ ఆ దేశ పౌరులను హెచ్చరించారు. ఈ నెల 30లోగా ఆ వివరాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గొప్ప దేశంగా మనం ఎదగాలంటే, మనం మారాల్సిన అవసరం ఉందని, ఆస్తులు వెల్లడించే పథకంలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా వెల్లడించాలన్నారు. బినామీ అకౌంట్లు, ప్రాపర్టీలు ఉన్న వారి వివరాలు తమ దగ్గర ఉన్నాయని, పన్ను అధికారులు వారి పనిపడుతారన్నారు. ప్రపంచంలో అతి తక్కువ పన్నులు వసూలు చేస్తున్నది పాకిస్థానేనన్నారు.

338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles