బ్రిటన్‌లో అతిపిన్న వయసు అకౌంటెంట్!

Thu,April 25, 2019 01:55 AM

Ranveer Singh Sandhu becomes youngest accountant of Britain

-బడికెళ్లేదశలో రెండు కంపెనీల నిర్వహణ
-భారత సంతతి బాలుడి ఘనత
లండన్: పదిహేనేండ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు? స్కూల్ కి వెళ్తూ.. ఆడుకుంటారు! ఐతే, దక్షిణ లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన రణ్‌వీర్ సింగ్ సందు (15) మాత్రం బడికెళ్లే దశలోనే పలు కంపెనీలకు అకౌంటెంట్, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 25 ఏండ్ల లోపు మిలియనీర్‌గా మారాలన్న లక్ష్యంతో ఈ చిన్నారి 12 ఏండ్లకే తన మొదటి వ్యాపార సంస్థను ప్రారంభించాడు. నచ్చిన జీవితాన్ని అనుభవిస్తూనే, డబ్బు సంపాదింలంటున్న రణ్‌వీర్‌కి ఇప్పటికే 10 మంది క్లయింట్లు ఉన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సలహాలిచ్చే ఈ బాలుడు గంటకు ఒక్కొక్కరి వద్ద 12 నుంచి 15 పౌండ్లను వసూలు చేస్తాడు. 12 ఏండ్లకే బేసిక్ అకౌంటింగ్ సర్టిఫికెట్‌ను సాధించిన ఇతను డిజిటల్ అకౌంట్స్ పేరుతో 2016 జూన్‌లో తొలి వ్యాపార సంస్థను ఆరంభించాడు. రణ్‌వీర్ సింగ్ సందు పేరుతో రెండేండ్ల తర్వాత ప్రారంభించిన మరో కంపెనీ ప్రస్తుతం విస్తరణ దశలో ఉన్నది. రణ్‌వీర్ తండ్రి అమన్ సింగ్ సందు బిల్డర్. తల్లి దల్విందర్ కౌర్ సందు ఎస్టేట్ ఏజెంటుగా పనిచేస్తున్నారు. ఇంటి నుంచే ఆఫీసు కార్యకలాపాలను నిర్వర్తించే రణ్‌వీర్.. తల్లిదండ్రుల ప్రోత్సాహం మొదటి నుంచి ఉండటం వల్ల అటు చదువు, ఇటు వ్యాపారాన్ని చక్కగా చేయగలుగుతున్నట్టు చెప్పాడు.

785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles