గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత

Tue,May 14, 2019 03:18 AM

Saudi Arabia says oil tankers were attacked off the UAE coast Iran calls for a probe

- ఆయిల్ ట్యాంకర్లపై కుట్రపూరిత దాడి : సౌదీ

ఫుజైరా (యూఏఈ): ఫుజైరా రేవులో ఆదివారం జరిగిన పేలుళ్లతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తు తెలియని శక్తులు ఇక్కడి ఆయిల్ ట్యాంకర్లపై కుట్రపూరిత దాడులకు పాల్పడ్డాయని సౌదీ అరేబియా సోమవారం ఆరోపించింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్ఠంభనతో ఈ ప్రాంతం ఉద్రిక్తంగా మారగా, తాజా పేలుళ్లు దానికి మరింత ఆజ్యం పోశాయి. ఆయిల్ ట్యాంకర్ల పేలుళ్లపై దర్యాప్తుకు ఆదేశించిన ఇరాన్, సముద్ర జలాల్లో భద్రతను భంగపరిచేందుకు కొన్ని విదేశీ శక్తులు ఈ దుస్సాహసానికి ఒడిగట్టి ఉంటాయని ఆరోపించింది. గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్ల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశముందని బ్రిటన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఇప్పటికే తన సైనిక బలగాలను బలోపేతం చేసింది. ఫుజైరా రేవులో వాణిజ్య, పౌర రవాణా నౌకలపై జరిగిన దాడిని ఇరాన్‌కు బద్ధశత్రువైన సౌదీ అరేబియా ఖండించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జలాల్లో లంగరు వేసిన నౌకలపై జరిగిన దాడిని కుట్రపూరితమైనదిగా పేర్కొంది. ఈ నేరపూరిత చర్య సముద్ర జలాల్లో నౌకల రవాణాకు తీవ్ర ముప్పును సూచిస్తున్నది. ఈ దాడులు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు భంగం కలిగిస్తున్నాయి అని యూఏఈ పేర్కొంది. ఫుజైరా రేవులో వేర్వేరు దేశాలకు చెందిన నాలుగు వాణిజ్య నౌకలు లక్ష్యంగా పేలుళ్లు సంభవించాయని తెలిపింది. రెండు ట్యాంకర్లకు నష్టం జరిగిందని, అయితే ప్రాణ నష్టం లేదా చమురు లీకవడం జరుగలేదని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖాలిద్ అల్ ఫలీహ చెప్పారు. దాడులకు గురైన నౌకలలో రెండు ట్యాంకర్లు అమెరికా కోసం చమురు నింపుకొనేందుకు సౌదీ టెర్మినల్ వైపు వెళుతున్నాయని తెలిపారు. ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles