37 మందికి సౌదీ మరణదండన

Wed,April 24, 2019 12:57 AM

Saudi death toll for 37 people

రియాద్, ఏప్రిల్ 23: ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనే అభియోగాలపై సౌదీ అరేబియా మంగళవారం 37 మందికి సామూహిక మరణదండన అమలుచేసింది. రియాద్‌తోపాటు మక్కా, మదీన, కాసిం, తూర్పు ప్రావిన్సులో ఈ శిక్షలు అమలుపరిచింది. శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు వీరికి మరణశిక్ష విధించినట్లు అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్‌పీఏ) వెల్లడించింది. మరణశిక్ష అనంతరం ఓ వ్యక్తికి శిలువ వేసినట్లు తెలిపింది. తీవ్రమైన నేరానికి పాల్పడిన వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మందికి మరణదండన విధించినట్లు ఎస్‌పీఏ తెలిపింది.

368
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles