భారత్‌లో ఆరు అణు విద్యుత్ కేంద్రాలు

Fri,March 15, 2019 01:43 AM

Six nuclear power stations in India

-అమెరికా నేతృత్వంలో నిర్మాణం
వాషింగ్టన్, మార్చి 14: భారత్‌లో ఆరు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు అమెరికా అంగీకరించింది. ఇరుదేశాల మధ్య భద్రతాపరమైన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పౌర అణు సహకారంలో భాగంగా ఈ ప్లాంట్లను నిర్మించనుంది. న్యూక్లియర్ సైప్లె గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వం కోసం తన మద్దతు ఉంటుందని అమెరికా తెలిపింది. భద్రతపై భారత్-అమెరికా మధ్య బుధవారం వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఆయుధాల నియంత్రణ, అంతర్గత భద్రత విభాగం అధికారి అండ్రియా థామ్సన్ పాల్గొన్నారు. అనంతరం ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అమెరికా-భారత్ మధ్య భద్రతాపరమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. అలాగే పౌర అణు రంగంలో మరింత సహకరించుకోనున్నాం. ఇందులో భాగంగా భారత్‌లో ఆరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లను అమెరికా నెలకొల్పనుంది అని ఆ ప్రకటన పేర్కొంది. అయితే ఈ అణు విద్యుత్ కేంద్రాలను ఎక్కడ నెలకొల్పనున్నారన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం పొందేందుకు సహకారిస్తామని అమెరికా తెలిపింది.

527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles