దక్షిణాఫ్రికాలో భారీవర్షాలకు

Thu,April 25, 2019 01:53 AM

South Africa floods and mudslides kill 33

-33 మంది దుర్మరణం పోర్ట్ సిటీ డర్బన్‌లో ఘటన
డర్బన్: దక్షిణాఫ్రికాలో కురుస్తున్న భారీ వర్షాలు పోర్ట్ సిటీ డర్బన్‌ను అతలాకుతలం చేశాయి. వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వానలతో పలు ప్రాంతాల్లో నీటమునిగి, ఇంటి గోడలు కూలి, కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులతోపాటు 33 మంది మరణించారు. పది మంది చిన్నారులతోపాటు పలువురు గల్లంతయ్యారని, మరో 42 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచే భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. బురదలో కూరుకుని మరణించినవారిని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 145 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు పోటెత్త డంతో నగరంలోని ఓ హిందూ ఆలయంలో 10 మీటర్ల మేర వర్షపు నీరు నిలిచింది.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles