శ్రీలంకలో దేశవ్యాప్త కర్ఫ్యూ

Tue,May 14, 2019 03:29 AM

Sri Lanka blocks social media again after attacks on Muslims

- కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు: సైన్యాధిపతి సేన్నాయకే
- కొనసాగుతున్న మత ఘర్షణలు.. దుండగులపై పోలీసుల టియర్‌గ్యాస్ ప్రయోగం
- సోషల్ మీడియాపై నిషేధం.. సంయమనం పాటించాలని ప్రజలకు ప్రధాని విక్రమసింఘే పిలుపు


కొలంబో: ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. సోమవారం రాత్రి 9 నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా సైన్యాధిపతి మహేశ్ సేన్నాయకే మాట్లాడుతూ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో రోడ్డుపై కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశామన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల వినియోగంపైనా ప్రభుత్వం నిషేధం విధించింది. గత నెలలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన బాంబు దాడులతో శ్రీలంకలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ కోస్తా పట్టణం చిలాయ్‌లోని ఒక దుకాణం యజమాని అబ్దుల్ హమీద్ మహమ్మద్ హస్మర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు పెట్టినప్పటి నుంచి వివాదం మొదలైంది. మీరు మరింత నవ్వలేరు. మీరు ఆక్రందనలు చేసే రోజు వస్తుంది అని స్థానిక క్రైస్తవులను ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తున్నది. దీంతో కొందరు దుండగులు దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ముస్లింల దుకాణాలపై, మసీదులపై దాడి చేశారు.

రంగ ప్రవేశం చేసిన పోలీసులు సదరు దండుగులపై టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే జాతినుద్దేశించి మాట్లాడుతూ సంయమనం పాటించాలని కోరారు. అంతకుముందు తొలుత సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి కొన్ని గంటల పాటు కులియాపిటియా, హెట్టిపొలా, బింగిరియా, దుమ్మలసురియా పట్టణాల పరిధిలో కర్ఫ్యూను ఎత్తివేశామని ఓ పోలీసు అధికారి చెప్పారు. కానీ మధ్యాహ్నం హెట్టిపొలా పట్టణంలో ఘర్షణ జరగడంతో తిరిగి ఆ నాలుగు పట్టణాల్లోనూ మంగళవారం ఉదయం నాలుగు గంటల వరకు తిరిగి కర్ఫ్యూ విధించామని పోలీసు అధికారి తెలిపారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles