గ్రెటా థన్‌బర్గ్‌కు ఆమ్నెస్టీ పురస్కారం!

Sat,June 8, 2019 02:40 AM

Teen climate activist Greta Thunberg gets Amnesty prize

-పర్యావరణ పరిరక్షణ కోసం పలు ఉద్యమాలు చేసిన స్వీడన్ బాలిక
స్టాక్‌హోం, జూన్ 7: గ్లోబల్ వార్మింగ్ పట్ల ప్రజల్ని చైతన్యపరుస్తూ.. ప్రతి శుక్రవారం పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమ కార్యకర్త, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమనేత, పదహారేండ్ల బాలిక గ్రెటా థన్‌బర్గ్‌కు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్ఠాత్మక మానవ హక్కుల పురస్కారం అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ లభించింది. మీరు సరైనది అని భావించిన దానికోసం పోరాడండి. ఇలాంటి ఉద్యమాలకు గుర్తింపు రావడం ఆనందాన్నిస్తుంది అని థన్‌బర్గ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమినాయుడు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ థన్‌బర్గ్ పలు ఉద్యమాలకు సారథ్యం వహించారు.

469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles