థాయ్ యువరాణి ప్రధాని అభ్యర్థిత్వానికి అడ్డుకట్ట

Sun,February 10, 2019 01:46 AM

Thailands king condemns bid by sister to become PM

బ్యాంకాక్: ది థాయ్ రక్షా చార్ట్ పార్టీ తరఫున థాయ్‌లాండ్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు శుక్రవారం ప్రకటించి సంచలనం రేపిన యువరాణి ఉబొల్త్న్ర ఆశలపై ఆమె సోదరుడు, ఆ దేశ మహారాజు నీళ్లు చల్లారు. రాజ కుటుంబీకులు రాజకీయాల్లో పాల్గొనడం సంప్రదాయం కాదని, ఇది ఏమాత్రం సరికాదంటూ మహారాజు మహా వజిరాలాంగ్‌కోర్న్ ప్రకటించడంతో ఆమె ప్రధాని అభ్యర్థిత్వానికి అడ్డుకట్టపడింది. రాజు ప్రకటనతో వెంటనే స్పందించిన థాయ్ రక్షా చార్ట్ పార్టీ... శనివారం తమ ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేసింది. రాజ కుటుంబ ఆచారాలను, సంప్రదాయాలను తాము గౌరవిస్తామని ప్రకటించింది. 2014లో జరిగిన సైనిక కుట్రలో ఇంగ్లక షినవత్ర పదవీచ్యుతురాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుత మిలిటరీ ప్రభుత్వానికి ప్రయుత్ చాన్ ఓచా నేతృత్వం వహిస్తున్నారు. సైనిక కుట్ర అనంతరం తొలిసారి మార్చిలో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా, తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఉబొల్త్న్ర కృతజ్ఞతలు తెలిపారు. 1972లో ఓ అమెరికన్‌ను వివాహమాడిన ఆమె రాజరికాన్ని వదులుకున్నారు.

689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles