ట్వీట్ తెచ్చిన తంటా

Mon,June 10, 2019 01:26 AM

U.S. writer sues publisher after losing book deal due to tweet

-రచయిత్రి నటాషా బుక్ డీల్ రద్దు
-పబ్లిషర్‌పై రూ. 90కోట్లకు దావా

వాషింగ్టన్: ఓ రచయిత్రి యాధృచ్చికంగా చేసిన ఓ ట్వీట్ పెద్ద దుమారానికి తెర లేపింది. అవార్డు గ్రహీత అయిన జోర్డన్ సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి నటాషా టైన్స్ ఈ ఏడాది మే 10న మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలు సంస్థలో పనిచేసే కార్మికురాలు నిబంధనలకు విరుద్ధంగా ట్రైన్‌లో టిఫిన్ చేయడాన్ని ఆమె గమనించారు. దీంతో దీనిపై ఆ సంస్థకు ట్వీట్ చేశారు. అయితే నల్లజాతికి చెందిన ఓ కార్మికురాలిపై నటాషా జాత్యాహంకారాన్ని ప్రదర్శించారంటూ ట్విట్టర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నటాషా ఆ ట్వీట్‌ను తొలిగించడంతోపాటు తన ట్విట్టర్ ఖాతాను కూడా మూసివేశారు. అయితే నటాషా తన పుస్తక ప్రచురణ, పంపిణీ కోసం ఒప్పందం చేసుకున్న రేర్ బర్డ్ సంస్థ ఆమె ట్వీట్ వివాదం నేపథ్యంలో.. డీల్‌ను రద్దు చేసుకుంది. దీంతో నటాషా కోర్టును ఆశ్రయించారు. బుక్ పబ్లిషర్ రేర్ బర్డ్‌పై 13 మిలియన్ డాలర్లకు (సుమారు 90.2 కోట్లు) పరువు నష్టం దావా వేశారు.

2140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles