పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఔట్!

Wed,November 6, 2019 03:01 AM

-ఐరాసకు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో నోటీసు
-ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డ డెమొక్రాట్లు

వాషింగ్టన్, నవంబర్ 5: భూతాపం నివారణకు 2015లో 188 దేశాలు సంతకం చేసిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగే ప్రక్రియను అమెరికా ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేశారు. 2020 నవంబర్ నాలుగో తేదీన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై విపక్ష డెమొక్రటిక్ పార్టీ మండిపడింది. అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పందిస్తూ పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్లక్ష్య పూరిత నిర్ణయంతో మూల్యం చెల్లించాల్సింది మన వారసులేనన్నారు. 2015లో కాప్21 పేరిట పారిస్ ఒప్పందం ఖరారులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించగా ఈ ఒప్పందం నుంచి వైదొలుగనున్నట్లు 2017 జూన్ 1న ట్రంప్ ప్రకటించారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles