చైనాలో డైనోసార్‌ గుడ్లు!

Tue,January 2, 2018 01:12 PM

బీజింగ్‌ః భూమిపై కొన్ని కోట్ల సంవత్సరాల కిందట రాక్షస బల్లులు తిరిగేవన్నది ఎన్నాళ్ల నుంచో ఉన్న వాదన. ఇది నిజమే అనడానికి ఇప్పటికే ఎన్నో ఆధారాలు దొరికాయి. ప్రపంచంలో ఏదో ఒక చోట డైనోసార్లకు చెందిన శిలాజాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలోనూ డైనోసార్లకు చెందిన గుడ్లు బయటపడ్డాయి. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గువాన్‌గ్జూ లో ఓ స్కూల్ నిర్మాణం కోసం తవ్వకాలు జరపుతుండగా ఇవి బయటపడ్డాయి.


ఓ పెద్ద బండరాయిని పగలగొట్టడానికి డిటోనేటర్లు ఏర్పాటుచేశారు. పేలుడు తర్వాత ఆ బండరాళ్ల ముక్కల్లో ఓ దాంట్లో సుమారు 30 గుడ్లు బయటపడ్డాయి. చైనాలో డైనోసార్ల హోమ్‌టౌన్‌గా ఈ ఊరికి పేరుంది. ఈ గుడ్లను స్థానిక నిపుణులు పరిశీలించి.. అవి డైనోసార్లకు చెందినవేనని తేల్చారు. 13 కోట్ల సంవత్సరాల కిందివిగా వాళ్లు తేల్చారు. ఇవి జురాసిక్ పీరియడ్ తర్వాత వచ్చిన క్రెటేషియస్ కాలానికి చెందిన డైనోసార్ల గుడ్లుగా నిపుణులు చెప్పారు. ఈ క్రెటేషియస్ పీరియడ్ 14.5 కోట్ల ఏళ్ల కింద మొదలైంది. 6.6 కోట్ల ఏళ్ల కిందట ముగిసింది. ఈ క్రెటేషియస్ కాలంలోనే డైనోసార్లు భూమిపై తిరిగేవి.

3885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles