కోడెల శివప్రసాద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Mon,September 16, 2019 01:29 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కోడెల మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాసేపటి క్రితం మాజీ మంత్రి కడియం శ్రీహరి బసవతారకం ఆస్పత్రికి చేరుకున్నారు. కోడెల కుటుంబ సభ్యులను కడియం పరామర్శించారు.

1631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles