బ్యాంక్‌ మేనేజర్‌ తాట తీసిన మహిళ

Wed,June 19, 2019 06:14 PM

కర్ణాటక : దావణగెరకు చెందిన మహిళ ఓ బ్యాంక్‌ మేనేజర్‌ తాట తీసింది. లోన్‌ కావాలా.. ఎంతైనా ఇస్తాను.. నిన్ను నేను చూసుకుంటాను అంటూ వెకిలి వేషాలు వేసిన బ్యాంకు మేనేజర్‌ను నడి రోడ్డుపై చెప్పుతో కొట్టింది. ఆడపిల్లలంటే నీకు అంత చులకనా?.. నీకు ఉద్యోగ మిచ్చింది ఎవడు.. ఫోన్‌ చెయ్‌ వానికి.. ఇలాగే చెయమన్నడా... అంటూ బడితె పూజ చేసింది.


తనకు లోన్‌ అవసరమే లేదని, అయినా లోన్‌ ఇస్తానంటూ బ్యాంక్‌ మేనేజర్‌ తన వెంట పడుతున్నాడని, లోన్‌ ఎంతైనా ఇస్తాను కోరిక తీర్చమని వేధిస్తున్నాడని సదరు మహిళ ఆరోపిస్తున్నది. ఏమిటిది.. నీ పద్దతి బాగాలేదు అని నిలదీస్తే చంపుతా అంటూ బెదిరిస్తున్నాడని చెబుతున్నది.సుమారు 9 నెలల కింద జరిగిన సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


10061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles