దిగ్గజ సంగీత దర్శకుడు మృతి... ప్రధాని సంతాపం

Tue,August 20, 2019 11:18 AM

Mohammed Zahur Khayyam Hashmi died in his 92

న్యూఢిల్లీ: ఖయ్యాంగా ప్రాఖ్యాతిగాంచిన ప్రముఖ సంగీత దర్శకుడు మొహ్మద్ జహుర్ ఖయ్యాం హస్మి(92) మృతిచెందారు. శ్వాసకోశ సంబంధ వ్యాధితో పాటు వయోభారం వల్ల వచ్చిన ఇతర సమస్యల కారణంగా ఆయన ముంబయిలోని జూహులో గల సంజయ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కబీ కబీ, ఉమ్రావ్ జాన్, త్రిశూల్, నూరీ, షోలా ఔర్ షబ్నమ్ వంటి ఎన్నో చిత్రాలకు విజయవంతమైన సంగీతాన్ని అందించారు. ఖయ్యాం 17 ఏళ్ల వయస్సులో సంగీతకారుడిగా జీవితాన్ని ప్రారంభించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మ భూషణ్, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు ఆయన సొంతమయ్యాయి. ఖయ్యాం మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫేమస్ గాయని లతా మంగేష్కర్‌తో పాటు రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles