రామ్ చ‌ర‌ణ్ లుక్ రివీల్ చేసిన వ‌రుణ్ తేజ్..!

Sat,March 23, 2019 11:41 AM

varun tej reveals ram charan look

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పూణేలో భారీ షెడ్యూల్ జ‌రిపేందుకు చిత్ర బృందం సిద్ద‌మైంది. ఇప్ప‌టికే టీం అంతా షూటింగ్‌లో పాల్గొనేందుకు పూణే వెళ్ళ‌గా దాదాపు 47 రోజుల పాటు అక్క‌డ షూటింగ్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ , విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌, స‌ముద్ర‌ఖ‌ని కూడా పాల్గొంటార‌ని చెబుతున్నారు. చిత్రంలో చరణ్‌..అల్లూరి సీతారామరాజుగా, తారక్‌.. కొమరం భీంగా నటిస్తున్నారని ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో ప్రకటించాడు రాజమౌళి.

ప్రెస్‌మీట్‌కి హాజ‌రైన స‌మయంలో చ‌ర‌ణ్‌, తార‌క్‌లు ఇద్ద‌రు క్యాప్‌లు పెట్టుకొని త‌మ పూర్తి లుక్ రివీల్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తాడు అనే స‌రికి ఆయ‌న లుక్ ఎలా ఉంటుంద‌నే దానిపై అభిమానులు ఊహ‌ల‌లో మునిగి తేలుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్‌లో చెర్రీతో దిగిన ఓ ఫోటోని బ్ర‌ద‌ర్ ల‌వ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేశాడు. ఇందులో చ‌ర‌ణ్ లుక్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ 2020 జూలై 30న రిలీజ్ కానుంది.

1715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles