సిక్కింలో కమల వికాసం బీజేపీలో చేరిన


Wed,August 14, 2019 01:15 AM

10 SDF MLAs join BJP in Sikkim

-పది మంది ఎస్‌డీఎఫ్‌ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌)కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఈ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ రామ్‌ మాధవ్‌ సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ ఆశయాలు నచ్చి బీజేపీలో చేరినట్లు ఆ ఎమ్మెల్యేలు తెలిపారు. 32 స్థానాల సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలుపొందిన సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 సీట్లలో విజయం సాధించిన ఎస్‌డీఎఫ్‌ ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles