ఇక 11 అంకెల సెల్‌ఫోన్ నంబర్!

Sun,September 22, 2019 02:40 AM

-వినియోగదారుల సంఖ్య పెరుగడమే కారణం
-ల్యాండ్ లైన్ నంబర్లకు 10 అంకెల సిరీస్‌ను తెచ్చే యోచనలో ట్రాయ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్ నంబర్ల స్థానంలో 11 అంకెల మొబైల్ నంబర్లను తీసుకురావడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ కసరత్తు ప్రారంభించిందని నివేదికలు పేర్కొనడం తెలిసిందే. దేశంలో టెలికం నంబర్లకు పెరుగుతున్న డిమాండు, భవిష్యత్తు అవసరాలకు తగినట్టు 10 అంకెల మొబైల్ నంబర్ కనెక్షన్ల సంఖ్య లేకపోవడం వంటి కారణాల్ని దృష్టిలో ఉంచుకొని ట్రాయ్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. దీని వెనుక ఉన్న కారణాలివీ..

-మొబైల్ వాడకందార్ల సంఖ్య పెరుగుతుండటం వల్ల టెలిఫోన్ నంబర్లకు డిమాండ్ ఏర్పడటం
-9,8,7 నంబర్లతో ప్రారంభమయ్యే 10 అంకెల మొబైల్ నంబర్లు 210 కోట్ల కనెక్షన్లకు మాత్రమే సరిపోతాయి. ఈ నంబర్ల పరిమాణం భవిష్యత్తు అవసరాలకు సరిపోదన్న అంచనాలు
-2050 నాటికి దేశంలో మరో 260 కోట్ల మొబైల్ నంబర్ల అవసరం ఉండొచ్చని నివేదికలు చెబుతుండటం
-ఇంటర్నెట్ కోసం వాడే డోంగల్ కనెక్షన్లకు ఇచ్చే నంబర్లు కూడా 10 అంకెల నుంచి 11 అంకెల నంబర్లుగా మారనున్నాయి. దీంతో 3,5,6 నంబరు సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్లు (ప్రస్తుతం డోంగల్ కనెక్షన్లకు వాడుతున్నారు) కనుమరుగు కానున్నాయి.

మరికొన్ని విశేషాలు

-1993, 2003లో కూడా టెలిఫోన్ నంబర్ల సిరీస్‌ను భారత్ సమీక్షించింది.
-2003లో 75 కోట్ల ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 45 కోట్లు మొబైల్ నంబర్లు కాగా మిగతా 30 కోట్లు ల్యాండ్ లైన్ నంబర్లు
-మొబైల్ ఫోన్లకు 11 అంకెల నంబరు సిరీస్, ఫిక్స్‌డ్ లైన్(ల్యాండ్ లైన్) నంబర్లకు 10 అంకెల సిరీస్‌ను తెచ్చే యోచనలో ట్రాయ్ ఉన్నది.

4284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles