కడుపులో 116 ఇనుప మేకులు


Wed,May 15, 2019 01:37 AM

116 Iron Nails Wire Removed From Mans Stomach In Rajathans Bundi

- ఒక పొడవాటి వైరు, ఇనుప గోలీ
- శస్త్రచికిత్స ద్వారా తొలిగింపు


కోట: రాజస్థాన్‌లోని కోట జిల్లా బుండీ ప్రాంతంలో ఒక వ్యక్తి పొత్తి కడుపులో 116 ఇనుప మేకులు, ఒక పొడవైన వైరు, ఇనుప గోలి ఉన్నాయి. భోలాశంకర్ (42) అనే ఈ వ్యక్తి కొద్ది రోజులుగా పొత్తి కడుపులో నొప్పి వస్తున్నదని ఆదివారం చికిత్స కోసం బుండీ ప్రభుత్వ దవాఖానకు వచ్చాడు. అతడి పొత్తి కడుపును ఎక్స్‌రే తీసినప్పుడు ఈ ఇనుప మేకులు ఉన్న సంగతి చూసి ఆశ్చర్యపోయానని దవాఖాన సర్జన్ డాక్టర్ అనిల్ షైనీ తెలిపారు. ఆ వెంటనే సిటీ స్కాన్ చేసినప్పుడు కడుపులో ఇనుప మేకులు ఉన్నాయని ధ్రువీకరించుకుని సోమవారం శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలిగించామని అనిల్ షైనీ తెలిపారు. ఒక్కో ఇనుప మేకు పొడవు 6.5 సెం.మీ ఉంటుందని, ఇనుప మేకులు, వైరు, గోలీలను తొలిగించడానికి గంటన్నర సమయం పట్టిందన్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి నిలకడగా ఉన్నదని, చాలా బాగా మాట్లాడుతున్నాడన్నారు. భారీ మొత్తంలో ఇనుప గోళ్లు తన కడుపులోకి ఎలా వెళ్లాయో తెలియదని భోలా శంకర్ చెబుతున్నాడు. తోటమాలిగా పని చేస్తున్న భోలాశంకర్ పొత్తి కడుపులోకి అవి ఎలా చేరాయో తెలియదని ఆయన కుటుంబ సభ్యులూ అంటున్నారన్నారు. ఈ ఇనుప గోళ్లు పేగుల్లోకి వెళ్లి ఉంటే ప్రాణానికి ముప్పు ఉండేదని అనిల్ షైనీ చెప్పారు.

1245
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles