జనవరిలో 8.96 లక్షల ఉద్యోగాల కల్పన


Sat,March 23, 2019 02:18 AM

8.96 lakhs jobs created in January 2019 EPFO data

-17 నెలల్లో గరిష్ఠం: ఈపీఎఫ్‌ఓ
న్యూఢిల్లీ, మార్చి 22: సంఘటిత రంగంలో గత జనవరిలో 8.96 లక్షల ఉద్యోగాలు లభించాయని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించింది. ఇది గత 17 నెలల్లో అత్యధికమని పేర్కొన్నది. గతేడాది ఏప్రిల్ నుంచి సంఘటిత రంగంలో లభించిన ఉద్యోగాల వివరాలను ఈపీఎఫ్‌ఓ శుక్రవారం విడుదల చేసింది. 2018 జనవరిలో 3.87 లక్షల ఉద్యోగాలు లభించగా, ఏడాది జనవరిలో నికరంగా 8,96,516 ఉద్యోగాలు లభించాయని, ఇది 131 శాతం వృద్ధి అని తెలిపింది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారిలో 22-25 ఏండ్ల మధ్య వయస్కులు 2.44 లక్షల మంది కాగా, 18-21 ఏండ్ల మధ్య వయస్కులు 2.24 లక్షల మంది ఉన్నారు. 2017 సెప్టెంబర్ నెలలో 2,75,609 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. 2017 సెప్టెంబర్ నుంచి 2019 జనవరి వరకు నికరంగా సంఘటిత రంగంలో 76.48 లక్షల ఉద్యోగాలు లభించాయని వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో 7.16 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు తొలుత ప్రకటించింది. కానీ తాజా అంచనాలో దాన్ని స్వల్పంగా 1.8 శాతం తగ్గించి.. 7.03 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. 2017 సెప్టెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు ముందుగా అంచనా వేసినట్లు కాక 6.6 శాతం ఉద్యోగాలు తగ్గి, 67.52 లక్షలకు చేరాయి. గతేడాది మార్చిలో 29,023 మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగారని పేర్కొంది.

567
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles