నిన్న ఉల్లి.. నేడు టమాటా

Thu,October 10, 2019 03:04 AM

- ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.80


న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9: ఉల్లిగడ్డల ధరలు ఇటీవల పెరిగి ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా.. ప్రస్తుతం టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కిలో టమాటా ధర రూ.80 పలికింది. టమాటాలను పండించే రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసి రవాణాకు తీవ్ర అంతరాయం కలుగడంతోనే ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలోని ప్రధాన మార్కెట్లలో హోల్‌సేల్‌ ధర రూ.58 పలుకుతుండగా.. రిటైల్‌ వ్యాపారులు మాత్రం టమాటా నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. ఓ వ్యాపారస్థుడు మాట్లాడుతూ ‘టమాటా పండే రాష్ర్టాల్లో వర్షాలు కురిసి వరదలు రావడంతో సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ధరలు గత నాలుగైదు రోజుల నుంచి భగ్గుమంటున్నాయి’ అని తెలిపారు. వర్షాలకు పంట దెబ్బతినడం కూడా ధరలు పెరుగడానికి ఒక కారణమని చెప్పారు. మరోవైపు బుధవారం కోల్‌కతాలో కిలో టమాటా ధర రూ.60 పలుకగా, ముంబైలో రూ.54, చెన్నైలో రూ.40 ధర పలికింది.

547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles