ఏ ఒక్కరినీ వదలం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా

Thu,October 10, 2019 02:44 AM

- ప్రతి అక్రమ వలసదారుడిని వెళ్లగొడతాం: అమిత్‌ షా


కైతల్‌/లొహరు/మెహెం(హర్యానా): దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఏ ఒక్కరినీ వదులబోమని, వారిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా సొంతదేశాలకు తిరిగి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. హర్యానాలోని కైతల్‌, లొహరు, మెహెం ప్రాంతాల్లో బుధవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో అమిత్‌షా పాల్గొని మాట్లాడారు. ‘దేశమంతా ఎన్నార్సీ’.. బీజేపీ తదుపరి ప్రాధాన్య అంశమని చెప్పారు. ‘మేము 2024లో మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చేముందే దేశంలోని ప్రతి అక్రమవలసదారుడిని వెళ్లగొడతాం’ అని పేర్కొన్నారు. అసోం ఎన్నార్సీని ప్రస్తావిస్తూ.. ‘చొరబాటుదారులు 70 ఏండ్లుగా దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారు. అలాంటివారిని తరిమేయాలా? వద్దా?’ అని ప్రశ్నించారు. బీజేపీ చేసే ప్రతిపనిని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నదని, ఇప్పుడు దేశమంతా ఎన్నార్సీని సైతం వద్దంటున్నదని చెప్పారు.

169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles