అరుణ్‌జైట్లీ జ్ఞాపకాలు పదిలం


Mon,August 26, 2019 01:43 AM

Arun Jaitley will be remembered in Parliament Rahul Gandhi writes letter to his wife

-కుటుంబసభ్యులకు సంతాప లేఖ రాసిన రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు 25: పార్లమెంట్‌లో ఇకపై అరుణ్‌ జైట్లీ గళం వినిపించకపోయినా.. ఆయన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉంటాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. జైట్లీ మరణం నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఆయన కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటిస్తూ జైట్లీ భార్య సంగీతకు ఆదివారం ఓ లేఖ రాశారు. జైట్లీ తన నాలుగుదశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశ రాజకీయ రంగంపై చెరుగని ముద్రవేశారని కొనియాడారు. ‘ఇకపై పార్లమెంట్‌లో జైట్లీ గళం వినిపించకపోవచ్చు. కానీ ఆయన ఎప్పుడూ మా మధ్య ఉన్నట్టుగానే భావిస్తాం’ అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. వారికి ఈ కష్టకాలంలో ఆత్మైస్థెర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles