నాపై కాషాయ ముద్రకు యత్నం

Sat,November 9, 2019 02:01 AM

-నేను బీజేపీ మనిషిని కాను : రజనీకాంత్

చెన్నై: బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ తనను ఆహ్వానించలేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారు. కానీ తనకు కాషాయరంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మీడియాలోని ఓ వర్గంతోపాటు కొంతమంది వ్యక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలతోపాటు ఇతర అంశాల గురించి మాట్లాడేందుకు గురువారం ఆయన కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే రెండుసార్లు విలేకర్లను కలిశారు. తాను బీజేపీ మనిషిని కానని, ఏ పార్టీలో చేరాలో తానే నిర్ణయించుకొంటానని చెప్పారు. ఇటీవల ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ చుట్టూ అల్లుకొన్న వివాదాన్ని రజనీకాంత్ ప్రస్తావిస్తూ.. ఆయనతోపాటు తనకు కాషాయరంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తానుగానీ, తిరువళ్లువర్‌గానీ ఈ వలలో పడబోమని రజనీకాంత్ చెప్పారు.

556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles