0.3 ఎకరాపైనే వివాదం!

Mon,November 11, 2019 02:17 AM

న్యూఢిల్లీ: అయోధ్య వివాదం.. విస్తృత ప్రచారంలో ఉన్నట్లుగా 2.77 ఎకరాలకు సంబంధించినది కాదు. వాస్తవానికి, 0.309 ఎకరాపైనే (1500 చదరపు గజాలు) వివాదం నెలకొంది. అయోధ్యలో కేవలం 1500 చదరపు గజాల స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులపైనే హిందూ, ముస్లింల మధ్య వివాదం నెలకొన్నదని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రారంభ వాక్యంలోనే పేర్కొంది. మరి ఎందుకు 2.77 ఎకరాలు అని ప్రచారంలోకి వచ్చింది? అయోధ్యలో యాత్రికులకు వసతులు కల్పించేందుకు 1991లో నాటి కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వం ఈ 0.309 ఎకరాతోపాటు మొత్తంగా 2.77 ఎకరాలను సమీకరించింది. అయితే అలహాబాద్‌ హైకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. 2010లో హైకోర్టు తీర్పు అనంతరం మీడియా సంస్థలు వివాదాస్పద స్థలాన్ని 2.77 ఎకరాలుగా పేర్కొన్నాయని, అప్పటి నుంచి అది అలాగే కొనసాగుతున్నదని పలువురు లాయర్లు చెప్పారు.

477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles