మోదీ హెలికాప్టర్‌లో ట్రంకుపెట్టె!


Mon,April 15, 2019 01:50 AM

Black Trunk From PM Modis Chopper Unlocks Congress Conspiracy Theory

-అందులో ఏముంది? కాంగ్రెస్ సందేహాలు
-ఈ నెల 9న కర్ణాటకకు తీసుకొచ్చారు
-ప్రైవేట్ కారులో ఎక్కడికో తరలించారు
-ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసిన కాంగ్రెస్
-డబ్బు తరలించారంటూ అనుమానాలు
-ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్పుడు హెలికాప్టర్‌లో నల్లరంగు ట్రంకుపెట్టె ను తెచ్చారని, అందులో డబ్బు తరలించారని తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. దానిపై నిజానిజాలు తేల్చాలని కర్ణాటక కాంగ్రెస్ విభాగం ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ్ ఆదివారం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. చిత్రదుర్గ పర్యటనకు మోదీ ఓ హెలికాప్టర్‌లో, రక్షణగా మరో 3 హెలికాప్టర్లు వచ్చాయి. ల్యాండయిన తర్వాత ఒక హెలికాప్టర్‌లో నుంచి నల్లని ట్రంకు పెట్టెను ప్రైవేట్ వ్యక్తి కారులో ఎక్కడికో తరలించారు. అందులో డబ్బు తరలించారనే అనుమానాలు వస్తున్నాయి అని అన్నారు. ఒకవేళ తమ ఆరోపణలు అవాస్తవమైతే, విచారణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రధాని ప్రయాణించిన హెలికాప్టర్ నుంచి ఒక నల్లని పెట్టెను బయటికి తీసి.. ఇన్నోవా కారులో పెట్టి న దృశ్యాలు ఉన్నాయి. ఈ కారు ప్రధాని భద్రతాశ్రేణిలోనిది కాదని, ఆ పెట్టెను రహస్యంగా తరలించారని ఆనంద్‌శర్మ చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగానైనా.. మోదీ తన ఐదేండ్లపాలన గురించి ప్రజలకు నిజానిజాలను వివరించాలని సూచించారు. రాఫెల్ వివాదంపై మోదీ ఎందుకు మౌనందాల్చుతున్నారని ప్రశ్నించారు. ఎలాగైనా మళ్లీ గెలవాలని తన స్వార్థా నికి సైన్యం సాహసాలను ప్రచారానికి వాడుకుంటున్నారన్నారు.

వీకే సింగ్.. చరిత్రను చదువండి

1971 యుద్ధం ద్వారా ఇందిరాగాంధీ రాజకీయ లబ్ధి పొందారన్న కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యలపై ఆనంద్‌శర్మ మండిపడ్డారు. ఆయన చరిత్రను చదువాలన్నారు. ఇందిర 1971 మార్చిలో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్ యుద్ధం 1971 డిసెంబర్‌లో మొదలైంది. 16 రోజుల యుద్ధం తర్వాత భారత్ విజయం సాధించింది అని గుర్తుచేశారు. 1971 యుద్ధ సమయంలో పనిచేసిన ఆర్మీ అధికారిగా అసత్యాలు చెప్పినందుకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

1670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles