చైనా వస్తువులను బహిష్కరించండి


Fri,March 15, 2019 03:06 AM

Boycott Chinese goods

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ప్రచారం
న్యూఢిల్లీ, మార్చి 14: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా పదే పదే అడ్డుకోవడంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతున్నది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. చైనాను బహిష్కరించండి, ఉగ్రవాదానికి చైనా మద్దతు, చైనా వస్తువులను బహిష్కరించండి అన్న నినాదాలు ట్విట్టర్‌లో హాష్‌ట్యాగ్‌లుగా మారాయి. చైనా వస్తువులను బహిష్కరించాలన్న పిలుపు అప్పుడప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో అది మరింత జోరందుకుంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి చైనీస్ యాప్‌లను తొలిగించాలని అనేక మంది నెటిజన్లు కోరుతున్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలని ఏడు కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) కూడా పిలుపునిచ్చింది. వ్యాపారులు చైనా వస్తువులను కొనరాదు, అమ్మరాదు అంటూ కెయిట్ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles