ఏప్రిల్‌ నుంచి వాహనాలకు బీఎస్‌-4 ఇంధనం

Thu,October 10, 2019 02:50 AM

- కేంద్రమంత్రి జవదేకర్‌ వెల్లడి


జైపూర్‌: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని పెద్ద నగరాలలో భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-4 ఇంధనం అందుబాటులోకి రానుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. దీంతో వాహనాల ద్వారా కలిగే కాలుష్యం 80-90 శాతం తగ్గిపోతుందని తెలిపారు. ఇందుకోసం రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పారు. రాజస్థాన్‌లోని మాలవీయ జాతీయ సాంకేతిక సంస్థలో మంగళవారం మొక్కను నాటిన అనంతరం జవదేకర్‌ మాట్లాడారు. దేశంలోని 122 నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ వాయువు కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. బీఎస్‌-4 ఇంధనానికి అనుగుణమైన వాహనాల అమ్మకాలు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయన్నారు.

167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles