సరిహద్దులో కాల్పులు.. జవాన్ మృతి

Sat,November 9, 2019 02:14 AM

-రెండుకు చేరిన గ్రెనేడ్ మృతుల సంఖ్య

జమ్ము, శ్రీనగర్, నవంబర్ 8: దేశ సరిహద్దులో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ వీర మరణం పొందారు. పాకిస్థాన్ సైన్యం సహకారంతో కొంత మంది ఉగ్రవాదులు శుక్రవారం ఫూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్ గుండా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరి కదలికలను గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో జవాన్ రాహుల్ భైరూ సులగేకర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు ఇటీవల శ్రీనగర్‌లోని ఓ మార్కెట్‌పై ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో గాయపడిన ఓ వ్యక్తి మరణించారు.

151
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles