విద్యార్థుల పర్యావ‘రణం’!


Fri,March 15, 2019 03:15 AM

CCL youth join March 15 school strike for climate

-నేడు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు బంక్ కొట్టి పోరుబాట
-భూతాపంపై చరిత్రలోనే అతి పెద్ద నిరసనగా గుర్తింపు

న్యూఢిల్లీ, మార్చి 14: మీ పెద్దోళ్లున్నారనే.. అనే పాపులర్ డైలాగ్ గుర్తుంది కదా! భూతాపంపై దశాబ్దాలుగా పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా, పర్యావరణం నానాటికీ క్షీణిస్తుండడంతో విద్యార్థులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (మార్చి 15న) పాఠశాలలకు సెలవు పెట్టి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా వీధుల్లో గళమెత్తనున్నారు. కర్బన ఉద్గారాలకు చెక్ పెట్టేందుకు తామే రంగంలోకి దిగుతున్నారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్‌మెంట్ పేరుతో శుక్రవారం సమ్మెకు సైరన్ మోగించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 90 దేశాలకు చెందిన 1,200 పట్టణాల్లోని విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు. అతి పెద్ద పర్యావరణ నిరసనగా ఇది చరిత్రలో నిలిచిపోనున్నది.

germany2
2018 ఆగస్టులో తొలిసారి గ్రేట తున్‌బెర్గ్ అనే 16 ఏండ్ల పర్యావరణ కార్యకర్త ఈ ఫ్రైడ్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ప్రతి శుక్రవారం బడికి బంద్‌పెట్టి స్వీడన్ పార్లమెంట్ సమీపంలో పర్యావరణ పరిరక్షణ కోసం తున్‌బెర్గ్ ప్రదర్శన నిర్వహించేవారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా తున్‌బెర్గ్ చేపట్టిన నిరసన ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు (కాప్-24)లో ఈ బాలిక చేసిన చారిత్రక ప్రసంగం పెద్దలకు కనువిప్పు కలిగించింది. దీంతో ప్రకృతి కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరినీ ఏకం చేసి పోరాటం చేయాలని తున్‌బెర్గ్ నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. భారత్‌లో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి దిగనున్నారు.

341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles