పోటీ చేద్దాం.. రారండోయ్


Sat,March 23, 2019 02:58 AM

Chandrababu family is four Members naminations

-ఏపీ ఎన్నికల బరిలో బంధుగణం
-చంద్రబాబు కుటుంబం నుంచే నలుగురు
-సార్వత్రిక ముఖచిత్రం.. ఆసక్తికరం

కుటుంబ సపరివార సమేతంగా సినిమాలకు, వేడుకలకు వెళ్లడం సహజం. చివరకు ఎన్నికల్లో పోలింగ్ బూత్ కు వెళ్లడం కూడా చూస్తుంటాం. కానీ ఒకే కుటుంబం నుంచి పలువురు ఎన్నికల పోటీలోకి దిగడం అనేది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ అధికార టీడీపీ జాబితా ఇలా బంధుగణంతో అల్లుకుపోయింది. మరి సొంత శక్తి సామర్థ్యాలా? సొంత వారికి టికెట్ ఇచ్చేలా తెర వెనుక జరిగిన పైరవీలా? అనేది ఇదమిద్దంగా తేల్చలేకపోయినా.. అనేక నియోజకవర్గాల్లో ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు మాత్రం దాల్ మే కుచ్ కాలాహై అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరే ప్రజల నాడి ఎలా ఉన్నదనేది బహిర్గతం అయ్యేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో అల్లుకుపోయిన ఆ బంధుత్వాలను ఓ సారి పరిశీలిద్దాం.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎర్రంనాయుడి కుటుంబానికి ప్రాధాన్యం ఉన్నది. ఈ క్రమంలో ఆయన మరణం తర్వాత రాజకీయ అరంగ్రేటం చేసి శ్రీకాకుళం ఎంపీగా ఉన్న ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు రెండోసారి పోటీలోకి దిగుతున్నారు. ఎర్రంనాయుడు సోదరుడు, రామ్మోహన్‌నాయుడు బాబాయ్, మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా రామ్మోహన్‌నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ నుంచి పోటీపడుతున్నారు. ఆయన మామ బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి బరిలోకి దిగుతున్నారు.
LOKESH
వియ్యంకులు.. ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ ఇద్దరూ తాజా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గంటా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. నెల్లూరు అర్బన్ స్థానం నుంచి నారాయణ బరిలోకి దిగుతున్నారు. గంటా మరో వియ్యంకుడు రామాంజనేయులు తిరిగి భీమవరం నుంచి పోటీచేస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు, ఆయన కుమార్తె ఇద్దరూ తాజా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయనగరం ఎంపీ స్థానం నుంచి అశోక గజపతిరాజు బరిలో ఉన్నారు. ఆయన కుమార్తె విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండటం విశేషం. ఇదే జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న కిమిడి కళా వెంకట్రావు సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి పోటీచేస్తున్నారు. అరకు అభ్యర్థి కిడారి శ్రావణ్‌కు పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి వరుసకు పెద్దమ్మ. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి దేవినేని అనివాష్ పోటీచేస్తుండగా.. ఆయన బాబాయ్, మంత్రి దేవినేని ఉమ మైలవరం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతున్నారు.
sri-bharat
గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ వియ్యంకులు. వీరిద్దరూ తాజా ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీచేస్తున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ వారసులు, వరుసకు సోదరులైన జేసీ పవన్, ఆస్మిత్‌రెడ్డి తాజా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. జేసీ పవన్ అనంతపురం ఎంపీగా, తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుం చి ఆస్మిత్‌రెడ్డి బరిలోకి దిగుతున్నా రు. కేఈ వారసులు, వరుసకు సోదరు లు కూడా తాజా ఎన్నికల్లో పోటీచేస్తున్నా రు. పత్తికొండ నుంచి కేఈ శ్యామ్, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో నూ ఇదే తరహా సోదరీ సోదరులు బరిలో నిలుస్తుండటం విశేషం. మంత్రి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి, వరుసకు సోదరుడు అయిన బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి బరిలోకి దిగుతున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీగా పోటీచేస్తున్న శివానందరెడ్డి, పాణ్యం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన గౌరు చరితారెడ్డి అన్నా చెళ్లెల్లు. కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీచేస్తుండగా, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. పలమనేరు నుంచి పోటీచేస్తున్న అమర్‌నాథ్‌రెడ్డి, పుంగనూను నుంచి బరిలో నిలిచిన అనూషారెడ్డి బావామరదళ్లు. ఇలా టీడీపీ జాబితా బంధుగణంతో అల్లుకుపోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
balakrishna
టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుతోపాటు ఆయన బావమరిది, ఆపై వియ్యంకుడిగా మారిన బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు కొడుకు, మంత్రి లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరంలో అడుగుపెట్టారు. ఈయన బాలకృష్ణకు పెద్ద అల్లుడు. బాలకృష్ణ రెండో అల్లుడు విశాఖపట్నంకు చెందిన భరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇలా చంద్రబాబు కుటుంబంలో నలుగురు ఈసారి ఎన్నికల క్షేత్రంలో పోటీచేస్తున్నారు.

388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles