20న జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-2


Wed,August 14, 2019 01:17 AM

Chandrayaan-2 to reach moon orbit on Aug 20

-నేడు భూకక్ష్యను దాటనున్న వ్యోమనౌక
బెంగళూరు: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 వ్యోమనౌక ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. వచ్చే నెల 7న చంద్రుడి ఉపరితలంపై దిగనున్నది. ఈ వివరాల్ని ఇస్రో ఛైర్మన్‌ కె శివన్‌ వెల్లడించారు. గతనెల జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత.. ఐదుసార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ప్రతి ప్రక్రియ విజయవంతమైనదని.. అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున చేపట్టనున్నట్టు తెలిపారు. ‘బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-ల్యూనార్‌ ఇంజెక్షన్‌ (టీఎల్‌ఐ) అనే కక్ష్య పెంపు ప్రక్రియ జరుపబోతున్నాం. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుంది. ఆగస్టు 20నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశిస్తుంది. సెప్టెంబరు 7న చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై చంద్రయాన్‌-2 దిగుతుంది’ అని శివన్‌ తెలిపారు.

111
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles