దొంగతనం నెపంతో దళితుడిని కొట్టిచంపారు

Mon,September 23, 2019 02:52 AM

రాజస్థాన్‌లో ఘటన
కోటా (రాజస్థాన్‌): దొంగతనం నెపంతో దళితుడిని కొట్టిచంపిన ఘటన రాజస్థాన్‌లోని జాలవర్‌ జిల్లా గతోలి ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాటర్‌పంపును దొంగిలించాడంటూ మేవఖేదా గ్రామానికి చెందిన దులిచంద్‌ మీనా(40)పై పూరీలాల్‌ తన్వర్‌(60), అతడి ఇద్దరు కుమారులు దేవిసింగ్‌(23), మోహన్‌ (20) మరికొందరు దాడిచేశారు. సమాచారమందుకున్న మీనా తండ్రి ఘటనాస్థలికి చేరుకొని దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్నది.

205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles