డీఎంకే ప్రభంజనం


Fri,May 24, 2019 03:16 AM

DMK led front heads for landslide ensures TN bucks national trend

చెన్నై, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ఓటమి దిశగా పయనిస్తున్నది. ఈ రాష్ట్రంలో మొత్తం 38 ఎంపీ స్థానాలుండగా 2014లో అన్నాడీఎంకే దివంగత మాజీ సీఎం జయలలిత నేతృత్వంలో 37 స్థానాలను గెలుచుకుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. డీఎంకే కూటమి (కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో డీఎంకే, సీపీఐ భాగస్వాములు) 10 స్థానాల్లో గెలువగా.. 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కూటమిలోని పార్టీల వారీగా చూస్తే డీఎంకే 15 చోట్ల గెలువగా.. 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నది. దాని మిత్రపక్షం కాంగ్రెస్ రెండుచోట్ల గెలువగా.. ఆరుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. మరో మిత్రపక్షం సీపీఐ తిరుప్పూర్ (కే సుబ్బరాయణ్)లో గెలిచింది. మరో చోట ఆధిక్యంలో ఉన్నది. సీపీఎం రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది.

646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles