అభిజిత్‌కు అభినందల వెల్లువ

Tue,October 15, 2019 01:10 AM

‘అర్థశాస్త్రంలో నోబెల్‌కు ఎంపికైన అభిజిత్‌ బెనర్జీకి అభినందనలు. పేదరికం నిర్మూలనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. అభిజిత్‌తోపాటు నోబెల్‌కు ఎంపికైన ఎస్తేర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌లకు
అభినందనలు’
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి


‘అద్భుతమైన విజయంతో బెనర్జీ దేశాన్ని గర్వపడేలా చేయడమేగాక, ప్రయోగాత్మక విధానం ద్వారా పేదరిక నిర్మూలనలో భారత్‌తో సహా ప్రపంచంలోని లక్షలాది మంది ప్రజలకు సహాయపడ్డారు. ఆయనకు నోబెల్‌ పురస్కారం లభించడం భారతీయులందరికీ సంతోషదాయకం’
- సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధినేత్రి

‘నోబెల్‌ను సొంతం చేసుకున్న అభిజిత్‌కు అభినందనలు. పేదరికాన్ని తొలగించి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిచ్చే విధంగా కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ‘న్యాయ్‌' కార్యక్రమానికి కన్సల్టెంట్‌గా ఆయన సహకారం అందించారు’
- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

భారత్‌ వంటి వర్ధమాన దేశాల్లో విధానాల రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడేలా ఆర్థికశాస్త్ర రంగంలో చేసిన వినూత్న ఆవిష్కరణలకు ఈ ఏడాది నోబెల్‌ను ప్రకటించటం హర్షణీయం.
- మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌

(2012లో తాను ప్రధానిగా ఉన్న సమయంలో తన ఆర్థిక విధాన కీలక బృందంలోకి అభిజిత్‌ను తీసుకోవాలని మన్మోహన్‌ భావించారు)‘అభిజిత్‌ వినాయక్‌ బెనర్జీకి నోబెల్‌ రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మేమిద్దరం ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థులం. అభిజిత్‌ పీహెచ్‌డీ పట్టా పొందిన హార్వర్డ్‌ యూనివర్శిటీలో ప్రస్తుతం నేను ఎకనామిక్స్‌, ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా ఉన్నాను’
- అమర్త్యసేన్‌, నోబెల్‌ గ్రహీత (1998) <.B>

145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles