చావును ముద్దాడి..


Sat,March 23, 2019 02:05 AM

Efforts on to rescue 18 month old boy trapped in Haryana borewell

-బోరుబావిలో పడిన బాలుడు
-48 గంటల తర్వాత సురక్షితంగా వెలికితీత
-ఆపరేషన్ హర్యానా విజయవంతం
హిస్సార్, మార్చి 22: హర్యానాలో బోరు బావిలో పడిన బాలుడిని 48 గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీశారు. గురువారం హిస్సార్ జిల్లాలోని బాల్‌సమంద్ గ్రామంలో 18 నెలల వయసున్న బాలుడు నదీం ఇంటి బయట ఆడుకుంటూ సమీపంలోని బోరుబావిలో పడిపోయాడు. దీంతో సైనికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు కలిసి భారీ యంత్రాలతో బోరుబావి చుట్టూ తవ్వారు. ఇదే సమయంలో బాలుడికి ఊపిరి ఆడటానికి ఆక్సిజన్‌ను బోరుబావిలోకి పంపారు. ఇలా 48 గంటలపాటు నిరంతరాయంగా సహాయక చర్యలు చేపట్టి శుక్రవారం బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు. హిస్సార్ డిప్యూటీ కమిషనర్ అశోక్‌కుమార్ మీనా మాట్లాడుతూ బాలుడిని ప్రాణాలతో కాపాడటానికి తీవ్రంగా శ్రమించాం. తొలుత బాలుడు పడిపోయిన బావికి 20 అడుగుల దూరంలో తవ్వకాలు ప్రారంభించాం. బాలుడిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ఒక సొరంగాన్ని ఏర్పరిచాం. బాలుడు పడిన బావి 60 అడుగుల లోతు ఉండటంతో 55 అడుగుల వరకు యంత్రాలను ఉపయోగించాం. తర్వాత చిన్న పరికరాలతో తవ్వుకుంటూ బాలుడి వద్దకు చేరుకున్నాం. అనంతరం చాలా జాగ్రత్తగా బాలుడిని బయటికి తీశాం. అతడిని హిస్సార్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించాం అని తెలిపారు.

531
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles