ఫ్లేవర్ ఈ-సిగరెట్లతో ఆస్తమా ముప్పు

Sun,September 22, 2019 02:26 AM

-ఆస్ట్రేలియా పరిశోధకుల హెచ్చరిక
మెల్‌బోర్న్,: ఈ-సిగరెట్లలో రుచి కోసం వినియోగించే పదార్థాల(ఫ్లేవర్ల)తో ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధుల ముప్పు మరింత పెరిగే అవకాశమున్నదని ఓ పరిశోధనలో తేలింది. ఈ-సిగరెట్లలో వినియోగించే నికోటిన్‌తో కూడిన, నికోటిన్ లేని ఫ్లేవర్ ద్రవాల వల్ల తలెత్తే అస్తమా, అలర్జి వంటి శ్వాసకోశ వ్యాధులపై ఆస్ట్రేలియాకు చెంది న యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (యూటీఎస్) పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ ఫ్లేవర్ ద్రవాలు విషపూరితమైనవని, వీటిని పీల్చితే శ్వాసకోశ రోగాల తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని పరిశోధనకుడు డేవిడ్ చాప్‌మాన్ తెలిపారు. అయితే అన్ని ఫ్లేవర్ ఈ-సిగరెట్లు ఊపిరితిత్తులపై ఒకేవిధమైన ప్రభావం చూపవన్నారు. బ్లాక్ లైకోరైస్ ఫ్లేవర్ వల్ల వాయునాళాల్లో నొప్పి తీవ్రత పెరుగగా, సిన్నాసైడ్ వల్ల నొప్పి తగ్గుతుందన్నారు. బనానా పుడ్డింగ్ ఫ్లేవర్ వల్ల కణజాలంపై మచ్చలు ఏర్పడతాయని చెప్పారు. నికోటిన్‌కు బాధ నివారణ గుణం ఉండటంతో దీనితో కూడిన ఈ-సిగరెట్ ద్రవాలు వాయునాళాల్లో నొప్పిని మాయం చేస్తాయని వెల్లడించారు. వీరి పరిశోధన నివేదిక సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles