ఐదో ఇంజిన్‌తోనే సమస్య!

Sun,September 22, 2019 02:45 AM

-ల్యాండర్ విక్రమ్‌లో ఐదో ఇంజిన్ చేరికతో పెరిగిన ప్రయోగ సంక్లిష్టత
-చివరి నిమిషంలో ప్రయోగంలో మార్పులు.. తలెత్తిన సాంకేతిక సమస్యలు
-ఇస్రో మాజీ శాస్త్రవేత్తల విశ్లేషణ

బెంగళూరు, సెప్టెంబర్ 21: చంద్రయాన్-2లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్‌లో ఐదు ఇంజిన్లను వినియోగించడం వల్లే సమస్యలు తలెత్తా యని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తు న్నారు. ముఖ్యంగా ఐదో ఇంజిన్‌ను (మధ్య ఇంజిన్) చేర్చడం వల్ల ప్రయోగం మరింత సంక్లిష్టంగా మారిందని చెప్తున్నారు. దీంతోపాటు ప్రయోగంలో చివరి నిమిషంలో చేసిన మార్పులు, సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్లాన్-బీ లేకపోవడం వంటి కారణాలతో విక్రవ్‌ు చంద్రుడిపై సున్నితంగా దిగడంలో తడబడి ఉంటుందన్నారు. వారు పేర్కొంటున్న కారణాలివీ..

ఐదు ఇంజిన్లతో సంక్లిష్టత

విక్రవ్‌ులో ఐదు ఇంజిన్లున్నాయి. నాలుగు ఇంజిన్లను ఏకరీతిగా ఒకేతాటిపైకి తీసుకొచ్చి పని చేయించడమే సాంకేతికంగా సవాలుతో కూడుకున్నది. అయితే, విక్రవ్‌ులో ఇంకో ఇంజిన్ (మధ్య ఇంజిన్) కూడా ఉన్నది. ఇది ప్రయోగం మొత్తాన్నే మరింత సంక్లిష్టంగా మార్చివేసింది.

సింగిల్ ఇంజిన్ వాహకనౌకలు మేలు

చంద్రుడిపై ప్రయోగాలు చేసేందుకు ప్రయోగించే వాహకనౌకలకు సింగిల్ ఇంజిన్ (3,500 న్యూటాన్ల సామర్థ్యం) సరిపోతుంది. దీంతో ప్రయోగంలో సంక్లిష్టత తగ్గుతుంది. మిగతా దేశాలు ఇదే విధానాన్ని పాటిచాయి. సింగిల్ ఇంజిన్‌తో ప్రయోగించిన ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా సున్నితంగా దిగేది. ఒకటికంటే ఎక్కువ ఇంజిన్లు ఉండటం వల్ల ఇంజిన్ల మధ్య సమన్వయలోపం జరిగి ప్రయోగంలో సంక్లిష్టత ఏర్పడింది.

చివరి నిమిషంలో మార్పులు

ఆఖరి నిమిషంలో చంద్రయాన్-2లో మార్పులు చేయడం వల్ల అసలైన మిషన్ ప్లాన్ మారింది. చంద్రయాన్-2ను మొదట రెండు టన్నుల బరువు వరకు మోసుకెళ్లగల జీఎస్‌ఎల్వీ మార్క్-2 రాకెట్‌తో ప్రయోగించాలని అనుకున్నారు. అయితే, ఐదో ఇంజిన్‌ను చేర్చడం వల్ల వాహకనౌక బరువు పెరిగింది. దీంతో జీఎస్‌ఎల్వీ మార్క్-3ని వాడారు.

మారిన సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు

చంద్రుడి ఉపరితలానికి 10 మీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉన్నప్పుడు నాలుగు ఇంజిన్లను ఒకదాని తర్వాత ఒకటి మండిస్తూ సెకనుకు 2 మీటర్ల చొప్పున ల్యాండర్‌ను చంద్రుడి మీదకి సున్నితంగా దించాలని భావించారు. అయితే, ఐదో ఇంజిన్‌ను ప్రయోగంలోకి తీసుకోవడంతో సాఫ్ట్‌వేర్, ప్రయోగం స్వరూపమే మారిపోయింది. మారిన సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు పకడ్బందీగా పరీక్షించారో లేదో తెలియదు.

సమగ్రమైన రిహార్సల్స్ అవసరం

ప్రయోగంలో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయో లేదో రిహార్సల్స్ ద్వారా పరీక్షించాలి. సవాల్‌గా నిలిచే పరిస్థితులను వివిధ దశల్లో పరీక్షించి, సమగ్రంగా విశ్లేషించాలి. దీనికి నిర్దిష్ట సమయం అవసరం.

-అనుకోని అవరోధాలు

ల్యాండర్‌లో తప్పుడు సమాచారాన్ని లోడ్ చేయడం, ఒకటి కంటే ఎక్కువ ఇంజిన్‌లను వాడటం వల్ల అకస్మాత్తుగా ఆటంకాలు ఏర్పడటంతో ల్యాండర్ విక్రవ్‌ుతో సంబంధాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి.

-తుది దశలో అతి వేగం

సెకనుకు 5 మీటర్ల వేగంతో విక్రవ్‌ు చంద్రుడి ఉపరితలం మీద దిగాలి. అయితే, సాంకేతిక లోపాల కారణంగా తుది దశలో అతి వేగాన్ని అందుకున్నది.

-అవగాహనలేమి

చంద్రుడిపై దిగనున్న ల్యాండర్‌ను నియంత్రించ గల తుది దశపై శాస్త్రవేత్తలకు స్పష్టమైన అవగాహన లేదు.

-ప్లాన్-బీ ఎక్కడ?

విక్రవ్‌ులో సమస్య తలెత్తితే, ప్లాన్-బీతో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలి. అయితే, అలాంటి ప్రణాళికను ఇస్రో సిద్ధం చేసిందో లేదో తెలియదు.

3586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles