అక్టోబర్‌లో శ్రీనగర్‌లో పెట్టుబడిదారుల సదస్సు


Wed,August 14, 2019 12:47 AM

Global investors summit to be held in Srinagar from October 12

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అక్టోబర్‌ 12 నుంచి మూడు రోజుల పాటు శ్రీనగర్‌లో ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు’ జరుగనున్నది. ఈ సదస్సుకు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులు 2000 మందిని ఆహ్వానించనున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ రోడ్‌షోలను ప్రారంభిస్తారని జమ్ముకశ్మీర్‌ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ చౌదరి తెలిపారు. అహ్మదాబాద్‌, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైతోపాటు అంతర్జాతీయంగా దుబాయి, అబుదాబీ, లండన్‌, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, మలేషియాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తారన్నారు.

96
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles