హెచ్‌ఏఎల్‌ ఉద్యోగుల సమ్మె బాట

Tue,October 15, 2019 02:12 AM

- చట్ట విరుద్ధం: యాజమాన్యం


బెంగళూర్‌: వేతన సవరణతోపాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. అఖిల భారత హెచ్‌ఏఎల్‌ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ సూర్యదేవర చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యంతో చర్చలు విఫలమైనందు వల్లే తాము సమ్మె చేపట్టామని పేర్కొన్నారు. దేశంలోని తొమ్మిది హెచ్‌ఏఎల్‌ యూనిట్లలో సమ్మె సాగుతున్నదన్నారు. ఉద్యోగుల ఆందోళన చట్ట విరుద్ధం అని హెచ్‌ఏఎల్‌ పేర్కొన్నది. సమ్మెలో పాల్గొన్న వారిపై చర్యలు ఉంటాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles