ఢిల్లీలో జీన్స్.. నియోజకవర్గంలో చీర


Mon,February 11, 2019 01:19 AM

Harish Dwivedi Takes a Dig At Priyanka Gandhi

ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై మరో బీజేపీ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ హరీశ్ ద్వివేది ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ మాదిరే ప్రియాంక కూడా ఫెయిల్ అవుతారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్, టీ షర్టులు వేసుకుంటారు. నియోజకవర్గంలోనైతే చీర కట్టుకుంటారు. సింధూరం పెట్టుకుంటారు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె వేషధారణ, వంశం, భర్త, రాజకీయ అనుభవ లేమిని ప్రత్యర్థులు తరచూ విమర్శస్తున్న విషయం తెలిసిందే. బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా గతంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక అందంగా ఉంటారు. అంతకుమించి ఆమెకు ఏ రాజకీయ నైపుణ్యం లేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బలమైన నేతలు లేకే ఆ పార్టీ లోక్‌సభ బరిలో చాక్లెట్ ముఖాలను దించుతున్నదని బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారంపై ఆ పార్టీ మహిళా విభాగం బీకేసీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles