విరుచుకుపడనున్న బుల్‌బుల్

Sat,November 9, 2019 01:11 AM

-ఆదివారం ఉదయం బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్న తుఫాన్
-ఒడిశా, బెంగాల్‌లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. బుల్‌బుల్ తుఫాను మరింత ఉధృతంగా మారుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాను ఆదివారం ఉదయం తీరం దాటే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. తుఫానుధాటికి ఆయా ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఇప్పటికే, బుల్‌బుల్ ప్రభావంతో ఒడిశా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. బుల్‌బుల్ తుఫాను నేపథ్యంలో క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) శుక్రవారం సమావేశమై తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించింది.

208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles