మలేరియా నియంత్రణలో ఆదర్శం

Thu,October 10, 2019 01:17 AM

- మాతా, శిశు మరణాలు తగ్గాయి: కేంద్రం


న్యూఢిల్లీ: మలేరియా నియంత్రణలో భారత్‌ గొప్ప విజయం సాధించిందని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 2013తో పోల్చితే 2017 నాటికి మలేరియా మరణాలు గణనీయంగా తగ్గాయని బుధవారం వెల్లడించింది. మొత్తం మరణాల్లో మలేరియా మరణాలు 2013లో 50.52 శాతం ఉండగా, 2017 నాటికి 49.09 శాతానికి తగ్గిపోయాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద చేపట్టిన కార్యక్రమాల అమలు, ఫలితాలపై బుధవారం కేంద్ర క్యాబినెట్‌ చర్చించింది. అనంతరం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 2005-2013 మధ్యకాలాన్ని ప్రస్తుత గణాంకాలతో పోల్చితే ప్రసవ సమయంలో మాతృ మరణాలు, శిశు మరణాల రేటు, ఐదేండ్లలోపు వయసున్న బాలల మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నదని తెలిపింది. ప్రతి వెయ్యి మంది బాలల్లో మరణాల సంఖ్య 2008లో 69 ఉండగా, 2017 నాటికి 37కు తగ్గింది. ఇదే సమయంలో ప్రతి వెయ్యి జననాల్లో మరణించే శిశువుల సంఖ్య 53 నుంచి 33కు పడిపోయింది. ప్రతి లక్ష మంది బాలింతల్లో మరణాల సంఖ్య 2004లో 254 ఉండగా, 2016 నాటికి 136కు పరిమితమైంది.

156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles