కులాన్ని బట్టి కాదు.. పదవిని బట్టి గౌరవిస్తున్నాం


Thu,September 12, 2019 02:45 AM

It Is This Mindset Kapil Sibal Slams Om Birla's Tweet On Brahmins

- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బ్రాహ్మణ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ విమర్శ

న్యూఢిల్లీ: బ్రాహ్మణులు పుట్టుకతోనే ఉన్నతులు అన్నట్లుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారని కాంగ్రెస్ మండిపడింది. ఆయన పదవినే తాము గౌరవిస్తున్నాం తప్ప ఆయన కులాన్ని కాదని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. ఆదివారం రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేశారు. వాటికి తన వ్యాఖ్యలను జోడించారు. బ్రాహ్మణులు సమాజంలో ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉన్నారు. త్యాగం, తపస్సు ఫలితంగా వారికి ఈ స్థానం దక్కింది. ఈ కారణం వల్ల బ్రాహ్మణులు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా ఉంటూ కీలకపాత్ర పోషిస్తున్నారు అని ఓం బిర్లా పేర్కొన్నారు.

దీనిపై కపిల్ సిబల్ బుధవారం స్పందిస్తూ పుట్టుకతోనే బ్రాహ్మ ణులు సమాజంలో ఉన్నతులుగా ఉన్నారని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇటువంటి మానసిక స్థితే.. కులాలతో, అసమానతలతో కూడిన భారత్‌కు కారణమవుతుంది. బిర్లాజీ మేం మిమ్మల్ని గౌరవిస్తున్నది మీరు బ్రాహ్మణులని కాదు. మీరు లోక్‌సభలో మా స్పీకర్ కాబట్టే అని ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా ట్విట్టర్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles