నెహ్రూ.. అసలు పాపి


Fri,March 15, 2019 03:06 AM

jawaharlal nehru original sinner favoured China for UNSC seat

-భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి భారత్‌ను కాదని చైనాకు మద్దతిచ్చారు
-రాహుల్‌పై అరుణ్ జైట్లీ ఎదురుదాడి

న్యూఢిల్లీ, మార్చి 14: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను చూసి ప్రధాని నరేంద్రమోదీ వణికిపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని చైనా అడ్డుకోవడంపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారని, ఆయన బలహీనమైన ప్రధాన మంత్రి అని రాహుల్ విమర్శించడంపై అరుణ్ జైట్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌ను కాదని చైనాకు మద్దతు పలికిన తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూయే అసలు పాపాత్ముడు అని జైట్లీ ఎదురుదాడికి దిగారు.

1955 ఆగస్టు 2న ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన ఓ లేఖను జైట్లీ ఉటంకిస్తూ.. అటు కశ్మీర్ విషయంలో, ఇటు చైనా విషయంలో నిజమైన తప్పు చేసింది ఒకే వ్యక్తని, ఆయనే నెహ్రూ అని చెప్పారు. చైనాను భద్రతా మండలిలోకి కాకుండా ఐక్యరాజ్య సమితిలోకి తీసుకోవాలి. భద్రతా మండలిలో చైనా స్థానాన్ని భారత్ తీసుకోవాలంటూ అమెరికా చేసిన సూచనలను మనం ఆమోదించలేం. చైనా లాంటి గొప్ప దేశాన్ని భద్రతా మండలిలోకి తీసుకోకపోవడం చాలా అన్యాయం అని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారని జైట్లీ ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. నిజమైన పాపాత్ముడు ఎవరో రాహుల్ మనకు చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles