త్రిపుర సీజేగా జస్టిస్ ఖురేషి

Sun,September 22, 2019 02:24 AM

-కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: జస్టిస్ అఖిల్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) నియమించాలని గతంలో తాను చేసిన సిఫారసును సుప్రీంకోర్టు కొలీజియం సవరించింది. తాజాగా ఆయనను త్రిపుర హైకోర్టు సీజేగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 5న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జస్టిస్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమించాలని మే 10న కొలీజియం సిఫారసు చేయగా, కేంద్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొలీజియం సిఫారసును వెనక్కి పంపుతూ, ఆగస్టు 23, 27వ తేదీల్లో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌కి పలు సూచనలు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కొలీజియం.. మునుపటి సిఫారసును సవరిస్తూ జస్టిస్ ఖురేషిని త్రిపుర హైకోర్టు సీజేగా నియమించాలని తాజాగా కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం జస్టిస్ ఖురేషి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.

203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles