కాపాడిన జవాన్లకు.. కన్నీటి వీడ్కోలు!


Wed,August 14, 2019 01:25 AM

Karnataka As Army Jawans Get Ready To Leave Villagers In Tears In FloodHit Chikkamagaluru

-కర్ణాటకలో వరద బాధితుల ఉద్వేగం
చిక్కమగళూరు (కర్ణాటక): సరిహద్దుల్లో కాపు కాసి దేశ ప్రజలకు రక్షణ కల్పించే జవాన్లు.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైతం సాయం చేయడానికి ముందుంటారు. వరదల నుంచి తమను కాపాడిన జవాన్లకు భాధితులు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ఈ ఉద్వేగభరిత ఘటన కర్ణాటకలో జరిగింది. ఇటీవల ముంచెత్తిన వరదలతో కర్ణాటక అతలాకుతలం అయ్యింది. చిక్కమగళూరు జిల్లాలోని ముదిగేరే గ్రామంలో వరద ఉధృతి తగ్గడంతో గత కొన్ని రోజులుగా సాగించిన సహాయక చర్యలకు జవాన్లు విరామం ఇచ్చారు. పరిస్థితి కుదుటపడటంతో అక్కడి నుంచి ప్రయాణానికి మంగళవారం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గ్రామస్థులంతా వరుసలో నిలబడి అశ్రునయనాలతో సైనికులకు ఘనంగా వీడ్కోలు పలికారు. మహిళలు ముందుకొచ్చి జవాన్లకు హారతి ఇచ్చి, చేతులకు రాఖీలు కట్టారు. నుదుట సింధూర తిలకాన్ని దిద్ది.. క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు.ఈ పరిణామానికి జవాన్లు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.

1058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles