వైద్యం..అద్భుతాలు..

Tue,October 15, 2019 01:01 AM

- మరియంకు సెయింట్‌ హోదా నేపథ్యంలో చర్చకు దారితీసిన డాక్టర్‌ సుల్ఫీ ఎఫ్‌బీ పోస్టు


తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రఖ్యాత క్రిస్టియన్‌ సన్యాసిని మరియం థ్రెసియాకు ‘పునీతురాలు’ (సెయింట్‌) హోదా ప్రకటించిన నేపథ్యంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌ సుల్ఫీ గత ఫిబ్రవరిలో పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. తీవ్రమైన వ్యాధుల నుంచి ప్రజలకు స్వస్థత చేకూర్చినందుకే మరియంకు ‘సెయింట్‌' హోదా కల్పించారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై సుల్ఫీ తన పోస్టులో ‘శ్వాసకోశ వైఫల్యం’ అనేది తీవ్రమైన వ్యాధి అని, దానిని అద్భుతాలతో నయంచేయలేమని, ఇలాంటి హోదాలు ప్రకటించేటప్పుడు వైద్యుల అభిప్రాయాలు కూడా తీసుకొంటే బాగుంటుందని పేర్కొన్నారు. అద్భుతాలు చేసేవారికి సెయింట్‌ హోదా ప్రకటించే సందర్భంలో కొన్ని మార్గదర్శకాలు పాటించాలని అభిప్రాయపడ్డారు. అయితే, తాను ఏ మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని, కాలంతోపాటు ఆచారాలు మారాలని తన పోస్టులో తెలిపారు. తాను కూడా అనేక మంది రోగులకు వైద్యసేవలు అందించి నయం చేశానని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సెయింట్‌ హోదా తనకు కూడా ప్రకటించాలని కోరారు. డాక్టర్‌ సుల్ఫీ వ్యాఖ్యలను చర్చివర్గాలు తోసిపుచ్చాయి. ఇలాంటి అద్భుతాలు నమ్మడానికి ప్రజలకు ఎలాంటి కారణాలు అవసరం లేదని కేరళ క్యాథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఫాదర్‌ వర్గీస్‌వల్లికట్టు తెలిపారు.

139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles